అమెరికాలో రెండు నెలల తర్వాత బయటకు వచ్చిన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా

  • లాస్ఏంజెలెస్‌లోని ఇంటి నుంచి బయటకు 
  • మాస్కు ధరించి భర్త నిక్‌తో బయటకొచ్చిన నటి
  • వైరల్ అవుతున్న ఫొటో
కరోనా కారణంగా రెండు నెలలపాటు అమెరికాలోని లాస్ఏంజెలెస్‌లో ఉన్న ఇంటికే పరిమితమైన బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా బయటకు వచ్చింది. అమెరికాలో పరిస్థితులు కొంచెంకొంచెంగా కుదుటపడుతున్న నేపథ్యంలో భర్త నిక్ జోనస్‌తో కలిసి ముఖానికి మాస్క్ ధరించి బయటకు వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. రెండు నెలల తర్వాత బయటకు వచ్చానని పేర్కొన్న ప్రియాంక ‘థ్యాంక్స్ టు మాస్క్స్’ అని పేర్కొంది. ఆమె పోస్టు విపరీతంగా వైరల్ అవుతోంది. పది లక్షలకు పైగా లైకులు వచ్చాయి.

Bollywood
Priyanka Chopra
america
Corona Virus

More Telugu News